
సీసీటీవీ దృశ్యాలు
కొలరాడో : ఎక్కడినుంచి వచ్చిందో! చర్చి ఆవరణలోకి పరిగెత్తుకొచ్చిందో కుక్క. పాత కక్షలు ఏమున్నాయో తెలీదు కానీ, ఆవేశంతో ఓ చిన్నారిమీదకు దూకి తీవ్రంగా గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అమెరికా కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ చర్చి పార్కింగ్ ఏరియాలోకి ప్రమాదకర జాతికి చెందిన ఓ బుల్‌డాగ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ కుక్క తల్లిదండ్రులతో కలిసి నడుస్తున్న చిన్నారిపైకి దూకి కరవటం మొదలుపెట్టింది.
ఈ హఠాత్పరిణామంతో పాప తల్లిదండ్రులు మొదట భయపడ్డా.. ఆ వెంటనే కుక్క బారినుంచి చిన్నారిని కాపాడేప్రయత్నం చేశారు. వారితో పాటు అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కూడా సహాయం చేశారు. వారి తీవ్ర శ్రమకు ఫలితంగా కొద్దిసేపటి తర్వాత కుక్క పాపను విడిచి పారిపోయింది. అయితే పాప మాత్రం తీవ్ర గాయాలపాలైంది. అక్కడి పార్కింగ్ ఏరియాలోని సీపీ టీవీలో రికార్డైన సంఘటనకు సంబంధించిన దృశ్యాలను హ్యూమన్ సొసైటీ తమ ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( చదవండి : ఎవరైనా నన్ను చంపేయండి!.. )

Comments
Please login to add a commentAdd a comment