
కుక్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
జంతువులు నటించిన చాలా చిత్రాలు గతంలో తెరపైకొచ్చాయి. అయితే జంతువులే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్‌లోనే రూపొందాయి. అలాంటిది ఒక కుక్క ప్రధాన పాత్రలో భారతీయ సినీ పరిశ్రమలోనే తొలిసారిగా ఏడ్వెంచర్ కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు దర్శకుడు శక్తివేల్ పెరుమాళ్‌స్వామి తెలిపారు. ఈయన ఇంతకుముందు ఉరుమీన్ అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని రూపొందించారు.
కాల్‌టైల్ సినిమాస్, యునైటెడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన ప్రకటన, ఫస్ట్‌లుక్ ఫోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ కుక్కకు, మనిషికి మధ్య అనుబంధం, ఒకరికి ఒకరు చేసుకునే సాయం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న ఎండ్వేంచర్ కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment