Boy Died Tried To Escape From Dog Attack In Hanmakonda District, Details Inside - Sakshi
Sakshi News home page

విషాదం: వీధి కుక్కల కారణంగా చిన్నారి మృతి

Published Tue, Jun 20 2023 11:32 AM | Last Updated on Tue, Jun 20 2023 12:00 PM

Boy Died Tried To Escape From Dog Attack In Hanmakonda District - Sakshi

సాక్షి, హన్మకొండ: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే పలువురు మృతిచెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, తాజాగా హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతిచెందాడు. 

వివరాల ప్రకారం.. తెలంగాణ దశాబ్ది సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 21రోజులపాటు జరిగే ఉత్సవాల్లో నేడు 19వరోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యా దినోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కాగా, విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీస్తుండగా విద్యార్థులపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఈ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి విద్యార్థి ఇనుగాల ధనుష్‌(12) మృతిచెందాడు. కాగా, ధనుష్‌ ఆరో తరగతి చదవుతున్నాడు. అయితే, ధనుష్‌ మృతితో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి.  

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement