
కౌడిపల్లి(నర్సాపూర్) : స్థలమేదైనా..సమయమేదైనా..మమ్మల్ని ఆపేదెవరు, మాకు అడ్డు చెప్పేవారు లేరు.. అన్నట్లుగా ఉంది శునకరాజుల తీరు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో శునకాలు అధికమయ్యాయి. వాటి దర్జాకు అడ్డులేకుండా ఉంది. కౌడిపల్లిలోని మండల కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో కుక్కలు గేదెమీద, కారు మీద దర్జాగా కూర్చుని సేదతీరాయి ఇలా..
