రామాయంపేట(మెదక్): రోడ్డుకు అడ్డంగా వచ్చిన శునకాన్ని తప్పించబోయి ఓ యవకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన పందిరి రమేశ్‌రెడ్డి ఆదివారం బైక్‌పై మిర్‌దొడ్డి మండలం మల్లుపల్లిలోఉంటున్న తన అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిజాంపేట సమీపంలో రోడ్డుకు అడ్డంగా కుక్క రాగా, దానిని తప్పించబోయిన రమేశ్ అదుపుతప్పి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
కుక్కను తప్పించబోయి..
Published Sun, Jan 3 2016 10:42 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement