Wound
-
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
ఉపాధి పనిలో గాయం.. వేలికి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి..
సాక్షి, గంగాధర(కరీంనగర్): కుటుంబం గడవడానికి ఉపాధి కూలీకి వెళ్లిన మహిళ గాయపడగా చికిత్సకోసం ఉన్న ఆస్తిని అమ్ముకున్నా గాయం మానని సంఘటన గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మకంటిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మకంటి రాజవ్వ, లింగయ్య దంపతులు గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తారు. గతనెలలో ఉపాధి పనులు చేస్తుండగా కాలివేలికి పార తగిలింది. తెల్లారి జ్వరం రావడంతో పనికి మానేసింది. కాలి గాయం ఎక్కువ కావడంతో కరీంనగర్ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వేలికి ఇన్ఫెక్షన్ అయిందని ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పడంతో ఉన్న 13 గుంటల భూమి అమ్మి వైద్యానికి ఖర్చు చేసినట్లు బాధితురాలి భర్త లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఉపాధి పనులకు వెళ్లిన డబ్బు ఇంకా రాలేదన్నాడు. రాజవ్వను వారంక్రితం ఇంటికి తీసుకువచ్చి ఇక్కడే ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయిస్తున్నానని, శరీరమంతా పాయిజన్ అయిందంటున్నారని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని లింగయ్య వేడుకుంటున్నాడు. -
బాలీవుడ్ హీరోకు గాయాలు
న్యూఢిల్లీ: సినిమా షూటింగ్‌లు బయటకు చెప్పుకునేంత సుఖాన్నేమి ఇవ్వవు. అప్పుడప్పుడు మాత్రమే అలా జరిగినా ఎక్కువసార్లు మాత్రం తెగ శ్రమించక తప్పదు. ఈ క్రమాలు గాయాల వేట కూడా తప్పదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు. ఓసినిమా షూటింగ్ లో ఉన్న ఆయన బొటన వేలికి తీవ్రంగా గాయం అయిందని ఆయన సోదరి సోహ అలీఖాన్ స్పష్టం చేసింది. సైఫ్ కు గాయం అయిందని, ఇప్పటికే చికిత్స కూడా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమె తెలిపింది. 45 ఏళ్ల సైఫ్ ఓ చిత్రం షూటింగ్ లో ఉండగా అనూహ్యంగా గాయపడ్డాడు. బొటన వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, తొలుత ఈ విషయం బయటకు రానివ్వలేదు. కాగా ఆయన సోదరి సోహా అలీఖాన్ మాత్రం తన సోదరుడు గాయపడి కోలుకుంటున్నాడని ఆదివారం ప్రకటించింది. దీంతో సైఫ్ నిజంగానే గాయపడ్డాడనే విషయం స్పష్టమైంది. -
కుక్కను తప్పించబోయి..
రామాయంపేట(మెదక్): రోడ్డుకు అడ్డంగా వచ్చిన శునకాన్ని తప్పించబోయి ఓ యవకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన పందిరి రమేశ్‌రెడ్డి ఆదివారం బైక్‌పై మిర్దొడ్డి మండలం మల్లుపల్లిలోఉంటున్న తన అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజాంపేట సమీపంలో రోడ్డుకు అడ్డంగా కుక్క రాగా, దానిని తప్పించబోయిన రమేశ్ అదుపుతప్పి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. -
'పేకాట గొడవ.. పేలిన తుపాకి'
అట్లాంటా: అమెరికాలో మరోసారి గన్ పేలింది. ఓ బార్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో దాదాపు పదిమంది గాయాలపాలయ్యారు. జార్జియా టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నైరుతి ఆట్లాంటాలోని జార్జియా పట్టణంలోగల హిల్ హవెన్ సెంటర్లోని బార్‌కు భారీ సంఖ్యలో జనం వచ్చారు. వారంతా అందులో సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా తుపాకీ చప్పుళ్లు వినిపించాయి. ఏం జరుగుతుందో తెలిసేలోగా పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారంతా కూడా 16 నుంచి 29 ఏళ్ల లోపువారే. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, ఈ బార్ వెనుక చట్ట వ్యతిరేకంగా పేకాట జరుగుతుండగా అక్కడ గొడవ జరిగి అనంతరం కాల్పులకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
భారతీయ జవాన్లకు గాయాలు
లండన్: భారత్-బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మంది భారతీయ సైనికులకు, ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలయ్యాయి. మిలటరీ పరికరాలు మోసుకొస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది జూన్ 13 నుంచి 28 వరకు బ్రిటన్‌లోని సాలిస్బరీ మైదానంలో ఇరు దేశాల సైనికులు ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నారు. దీంతోపాటు అనంతర కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా తిరిగొస్తుండగా ప్రమాద బారిన పడ్డారు. ఈ రెండు వాహనాలను నడిపింది బ్రిటన్ సైనికులే. గాయపడినవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. ఒక కెప్టెన్, హవల్దారు తీవ్రంగా గాయపడగా మిగితావారు మాత్రం స్వల్ఫ గాయాలతో బయటపడ్డారు. -
'మా వాళ్లు ఉన్నారో చనిపోయారో తెలియదు'
కోల్ కతా/కఠ్మాండు: తమ కుటుంబం వాళ్లు ప్రాణాలతో ఉన్నారో.. చనిపోయారో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భారత్ లోని నేపాల్ కాన్సులేట్ అధికారులు. గత శనివారం నేపాల్ ను భారీ భూకంపం తీవ్ర నష్టంలో ముంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య నాలుగువేలు దాటింది. ఈ నేపథ్యంలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో అనే విషయం కూడా తెలియక సర్వం స్తంభించి పోయి నేపాల్ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఘటనపట్ల భారత్‌లోని నేపాల్ కాన్సులేట్ కార్యాలయంలో పనిచేసే అధికారులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పారు. మూడు రోజులుగా ఇంటికి వెళదామని తమ వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా ఎలాంటి స్పందన రావడం లేదని, తమ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందోనని, వారు బతికి ఉన్నారో, చనిపోయారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సులేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు అధికారుల కుటుంబాల జాడ తెలియడం లేదని తెలిపారు. 4,347కు పెరిగిన మృతుల సంఖ్య నేపాల్ భూకంపం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య 4,347కు పెరిగింది. ఇది పెరగవచ్చని మంగళవారం అధికారులు తెలిపారు. మొత్తం పన్నెండు రాష్ట్రాలు భూకంపం బారిన పడగా వాటిలో కఠ్మాండు, సింధుపాల్చౌక్లలో వరుసగా 1,039, 1,176 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇక గాయపడిన వారి సంఖ్య కూడా 7,500కు పెరిగింది. చాలామంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు శరవేగం కొనసాగుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో 18 మందికి గాయాలు
పెనుబల్లి: రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఆగి ఉన్న లారీలోగల వారిలో 18మందికి గాయూలయ్యూరుు. పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వేంసూరుకు చెందిన ఎస్కె.మొహిద్దీన్ మొక్కు తీర్చుకునేందుకని తన బంధువులు 30 మందితో కలిసి నల్గొండ జిల్లా హుజూర్నగర్ సమీపంలోని జాన్పాడ్ దర్గాకు గురువారం అర్థరాత్రి బయలుదేరాడు. మార్గమధ్యలో లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు పక్కన లారీని ఆపి, చలి తగలకుండా వెనుక వైపు పట్టా కప్పి దానిని తాడుతో కడుతున్నారు. అదే సమయంలో వెనుకగా వచ్చిన లారీ.. ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఆగి ఉన్న లారీలోని 18 మందికి గాయాలయ్యూరుు. వీరిలో వేంసూరుకు చెందిన ఎస్కె దస్తగిరి, వీర రాఘవరావు తీవ్రంగా గాయపడ్డారు. దస్తగిరిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి, వీరరాఘవరావును గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని సత్తుపల్లి, ఖమ్మంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వియం బంజర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.