రోడ్డు ప్రమాదంలో 18 మందికి గాయాలు
పెనుబల్లి: రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఆగి ఉన్న లారీలోగల వారిలో 18మందికి గాయూలయ్యూరుు. పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వేంసూరుకు చెందిన ఎస్‌కె.మొహిద్దీన్ మొక్కు తీర్చుకునేందుకని తన బంధువులు 30 మందితో కలిసి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ సమీపంలోని జాన్‌పాడ్ దర్గాకు గురువారం అర్థరాత్రి బయలుదేరాడు. మార్గమధ్యలో లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు పక్కన లారీని ఆపి, చలి తగలకుండా వెనుక వైపు పట్టా కప్పి దానిని తాడుతో కడుతున్నారు.
అదే సమయంలో వెనుకగా వచ్చిన లారీ.. ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఆగి ఉన్న లారీలోని 18 మందికి గాయాలయ్యూరుు. వీరిలో వేంసూరుకు చెందిన ఎస్‌కె దస్తగిరి, వీర రాఘవరావు తీవ్రంగా గాయపడ్డారు. దస్తగిరిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి, వీరరాఘవరావును గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని సత్తుపల్లి, ఖమ్మంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వియం బంజర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.