బాలీవుడ్ హీరోకు గాయాలు
న్యూఢిల్లీ: సినిమా షూటింగ్లు బయటకు చెప్పుకునేంత సుఖాన్నేమి ఇవ్వవు. అప్పుడప్పుడు మాత్రమే అలా జరిగినా ఎక్కువసార్లు మాత్రం తెగ శ్రమించక తప్పదు. ఈ క్రమాలు గాయాల వేట కూడా తప్పదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు. ఓసినిమా షూటింగ్ లో ఉన్న ఆయన బొటన వేలికి తీవ్రంగా గాయం అయిందని ఆయన సోదరి సోహ అలీఖాన్ స్పష్టం చేసింది.
సైఫ్ కు గాయం అయిందని, ఇప్పటికే చికిత్స కూడా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమె తెలిపింది. 45 ఏళ్ల సైఫ్ ఓ చిత్రం షూటింగ్ లో ఉండగా అనూహ్యంగా గాయపడ్డాడు. బొటన వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, తొలుత ఈ విషయం బయటకు రానివ్వలేదు. కాగా ఆయన సోదరి సోహా అలీఖాన్ మాత్రం తన సోదరుడు గాయపడి కోలుకుంటున్నాడని ఆదివారం ప్రకటించింది. దీంతో సైఫ్ నిజంగానే గాయపడ్డాడనే విషయం స్పష్టమైంది.