భారతీయ జవాన్లకు గాయాలు
లండన్: భారత్-బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మంది భారతీయ సైనికులకు, ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలయ్యాయి. మిలటరీ పరికరాలు మోసుకొస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది జూన్ 13 నుంచి 28 వరకు బ్రిటన్లోని సాలిస్బరీ మైదానంలో ఇరు దేశాల సైనికులు ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నారు.
దీంతోపాటు అనంతర కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా తిరిగొస్తుండగా ప్రమాద బారిన పడ్డారు. ఈ రెండు వాహనాలను నడిపింది బ్రిటన్ సైనికులే. గాయపడినవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. ఒక కెప్టెన్, హవల్దారు తీవ్రంగా గాయపడగా మిగితావారు మాత్రం స్వల్ఫ గాయాలతో బయటపడ్డారు.