
పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
రాజంపేట రూరల్ : రాజంపేటలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక రాజు హైస్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చౌడయ్య వైఎస్సార్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.ఈయన టీ తాగేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వీధిలో ఉన్న పిచ్చికుక్క దాడిచేసి గాయపరిచింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోపుడుబండిలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే నరసయ్య అనే వ్యక్తిపై కూడా కుక్కలు దాడిచేసి గాయపరిచాయి.
చిట్వేలిలో మహిళపై..
చిట్వేలి : మండల పరిధిలోని నేతివారిపల్లిలో బుధవారం లక్ష్మీ నరసమ్మ (65) అనే మహిళపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఇప్పటి వరకు 20 మందిపై కుక్కలు దాడి చేసినట్లు సమాచారం. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.