వేములవాడ: వేములవాడలో బుధవారం కుక్కలు రెచ్చిపోయాయి. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చిన 25 మందిపై దాడి చేశాయి. గాంధీనగర్, జాతరాగ్రౌండ్, ఉప్పుగడ్డ, ముదిరాజ్‌వీధి ప్రాంతాల్లో దాదాపు 25 మందిని కరిచాయి. వీరంతా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. అందిరికీ యాంటీ రెబీస్ ఇంజక్షన్లు ఇచ్చి పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్‌రావు తెలిపారు. కుక్కల దాడులపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment