బంగాళ దుంప సేద్యంలో భాగంగా విత్తనాలను పూడుస్తున్న కుక్క
సామాన్యుల సంగతి పక్కన బెడితే బద్ధకస్తులు మాత్రం కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఇది చూశాక వాళ్లల్లో నిద్రిస్తున్న జీవకణాలు మొద్దు నిద్ర వదిలి వారిని పరుగులు పెట్టిస్తాయి. ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా దర్జాగా కూర్చుని తినేవారిని ఉరకలు పెట్టించొచ్చు కూడా. ఎందుకంటే ఆ వీడియో చూసి అబ్బ.. అనుకోవడం మానేసి ఔరా అనడం మొదలుపెడతారు. ఇంతకు ఆ వీడియో ఏమిటి? అందులో ఏముందని అనుకుంటున్నారా?
బంగాళదుంప సాగు చేస్తున్న ఓ యజమానికి వాటిని నాటేందుకు సాయం చేస్తున్న కుక్కకు సంబంధించినదే ఆ వీడియో. వ్యవసాయంలో ఆరితేరిన ఓ మనిషిలా ఆ కుక్క సేద్యం చేస్తున్న తీరు నిజంగా అద్భుతం. తన యజమాని ఒక్కో ఆలుగడ్డను నాటుతూ వెళుతుంటే ఆ గుంటలన్నింటిని పూడుస్తూ ఆ కుక్క పనిచేసిన తీరు చూస్తే మాత్రం బద్దకంగా ఉండే మనుషులు కాస్తంత అప్రమత్తమవడం మాత్రం కచ్చితం.
Comments
Please login to add a commentAdd a comment