చలికాలం వస్తుంది కదా అని మార్కెట్‌లో స్వెటర్ కొనడానికి వెళ్తే.. అక్కడ ‘ఎలుకలు కొరికిన స్వెటర్... కుందేలు కొరికిన స్వెటర్..’ ఇలా చిరిగిన స్వెటర్లు అమ్మే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నాం. నిజం, ఈ మధ్యనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్‌సియాగా ‘డిస్ట్రాయిడ్ క్రూనెక్’ పేరుతో కొత్తరకం స్వెటర్లను విడుదల చేసింది. వంద శాతం ఉన్నితో తయారు చేసిన వీటి డిజైన్, అచ్చం ఎలుకలు కొరికితే చిల్లులు పడిన స్వెటర్‌లాగే ఉంటుంది.
మొదట చిరిగిన ప్యాంటుగా పేరు పొందిన టాన్ జీన్స్ ఫ్యాషన్‌ను కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు సామాన్యులు కూడా ఇష్టపడిమరీ ఆ ప్యాంట్లను కొంటున్నారు. మార్కెట్లో వచ్చేవి యువతకు నచ్చితే చాలు వాటి సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇక ఈ స్వెటర్‌లో ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే దీని ధర. మీరు కనుక దీన్ని కొనాలనుకుంటే ఈ స్వెటర్‌లాగే మీ జేబు, పర్స్‌కూ చిల్లు పడ్డం ఖాయం. ఎందుకంటే ఈ స్వెటర్ అక్షరాల 1,450 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,07,652 పలుకుతుంది మరి!
చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment