వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ప్రారంభం
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ప్రారంభం
Published Wed, Aug 10 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఈడుపుగల్లు (కంకిపాడు) :
గ్రామ పరిధిలోని ఆర్‌కే వ్యాలీ భవనంలో ఏర్పాటు చేసిన కమిషనర్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం బుధవారం ప్రారంభించారు. వివిధ విభాగాధిపతుల చాంబర్‌లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ చాంబర్‌లో ఆ శాఖ ఉద్యోగులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అజయ్‌కల్లం మాట్లాడుతూ దసరాకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్ జే శ్యామలరావు, కమిషనర్ కార్యదర్శి సీ నాగరాణి, అడినల్ సీసీ జీ వెంకటేశ్వర్లు, పంపాపతి, జాయింట్ కమిషనర్ యు.ఏడుకొండలు, డిప్యూటీ కమిషనర్లు రఘునాథ్, వై.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement