కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆప్గన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అనంతరం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ దేశంపై ఆధిపత్యం సాధించారు.
ఇదిలా ఉండగా.. తాలిబన్ల సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆప్గనిస్తాన్ పిల్లల చదువు విషయంలో సర్కార్ దృష్టిసారించింది. వచ్చే వారం నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రభుత్వ విద్యా మంత్రి అజీజ్ అహ్మద్ రయాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుస్తున్నామని తెలిపారు. ఈ క‍్రమంలో కొన్ని కండీషన్ అప్లై అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యా సంస్థలు నడుస్తాయని చెప్పారు.
అయితే, బాలికలకు సంబంధించిన విద్యా సంస్థల్లో కేవలం మహిళా స్టాఫ్ మాత్రమే బోధిస్తారని తెలిపారు. అలాగే, రిమోట్ ప్రాంతాల్లో మహిళా స్టాఫ్ లేని క్రమంలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందించనున్నట్టు వెల్లడించారు. కాగా, బాలుర విద్యాసంస్థల్లో పురుషులతో తరగతుల నిర‍్వహణ జరుగుతుందన్నారు. మరోవైపు, ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్, కాలేజీల మూసివేత ఉండదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment