CONDITON
-
తాలిబన్ల రాజ్యం ఆప్గన్‌లో స్కూల్స్ ఓపెన్.. స్పెషల్ కండీషన్స్ అప్లై..
కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆప్గన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అనంతరం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ దేశంపై ఆధిపత్యం సాధించారు. ఇదిలా ఉండగా.. తాలిబన్ల సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆప్గనిస్తాన్ పిల్లల చదువు విషయంలో సర్కార్ దృష్టిసారించింది. వచ్చే వారం నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రభుత్వ విద్యా మంత్రి అజీజ్ అహ్మద్ రయాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని కండీషన్ అప్లై అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యా సంస్థలు నడుస్తాయని చెప్పారు. అయితే, బాలికలకు సంబంధించిన విద్యా సంస్థల్లో కేవలం మహిళా స్టాఫ్ మాత్రమే బోధిస్తారని తెలిపారు. అలాగే, రిమోట్ ప్రాంతాల్లో మహిళా స్టాఫ్ లేని క్రమంలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందించనున్నట్టు వెల్లడించారు. కాగా, బాలుర విద్యాసంస్థల్లో పురుషులతో తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు. మరోవైపు, ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్, కాలేజీల మూసివేత ఉండదని స్పష్టం చేశారు. -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేషన్ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన బెల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేష¯ŒS లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన »ñ ల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం