దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు లాభాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో 66,305 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల క్షీణతతో 19,781 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లలో తాజా పెరుగుదలకు మార్కెట్లు సర్దుబాటు అవుతున్న క్రమంంలో ఈరోజు ట్రేడింగ్ సెషన్ మందకొడిగా ప్రారంభమైంది. నిఫ్టీ50 19,820 మార్క్ పైన ప్రారంభమైంది. ట్రేడ్ ప్రారంభంలో సెన్సెక్స్ 50 పాయింట్లు మాత్రమే పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ప్రతికూల పక్షపాతంతో ప్రారంభమైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో సిప్లా, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అలాగే అపోలో హాస్పిటల్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడట్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment