భారత్ కొత్త పార్లమెంటు భవనాన్ని మే నెలాఖరు కల్లా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ తొమ్మిదేళ్ల పాలనుకు గుర్తుగా నిర్మించిన ఈ కొత్త పార్లమెంట్ భవనం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ భవనాన్ని దాదాపు 970 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో సుమారు 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇందులో భోజన గదులు, విస్తారమైన పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది.
ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణంలో జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిని వీఐపీలు, సందర్శకులు, అధికారుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలుగా కేటాయించారు. దీనిని 2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంభోత్సవంలో భాగంలో నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వానికి గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నెల రోజుల పాటు భారీగా ప్రత్యేక ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.
ఈ మేరకు మే 30న ప్రధాని మోదీ భారీ ర్యాలీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, ఆ మరుసటి రోజే ప్రధాని రెండో ర్యాలీని నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తదుపరి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని దర్కించుకుని నిరాటంకంగా తొమ్మిదేళ్లు పాలించారు.
అందుకు గుర్తుగా దేశ వ్యాప్తంగా బీజేపీ సినియర్ నేతలు సుమారు 51 ర్యాలీలు నిర్వహించనుండగా, దాదాపు 396 లోక్‌సభ స్థానల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ పేర్కొంది. ఈ ర్యాలీలు, బహిరంగ సభలకు బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం
(చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..)
Comments
Please login to add a commentAdd a comment