21న చంద్రబాబు రాక
Published Fri, Nov 18 2016 2:19 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
ఏలూరు (మెట్రో) : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 21న జిల్లాకు రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో ఉంగుటూరు మండలం గొల్ల గూడెం చేరుకుంటారు. అక్కడ పోలవరం కుడికాలువపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను 11 గంటలకు ఆయన ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో పోలవరం వెళతారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు పోలవరం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ బయలుదేరుతారు.
Advertisement
Advertisement