
Today Stockmarket Opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పండగ వేళ వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కీలక సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 67,196 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 117 పాయింట్లు క్షీణించి 20,016 వద్ద కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ గెయినర్స్‌గా కొనుసాగుతుండగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, జియో ఫినాన్సియల్ కంపెనీ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాల బాట పట్టాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)