
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2024 జనవరి 22న నూతన రామాలయంలో మర్యాద పురుషోత్తముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. తాజాగా శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15తో పోల్చారు.
రాయ్ మీడియాతోమాట్లాడుతూ దేశంలో 1947, ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో, 2024 జనవరి 22 కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే సాధనంగా అయోధ్య రామమందిర నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమవుతుండటంపై దేశ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు.
2024, జనవరి 22న నూతన రామాలయంలో జరిగే బాల రాముని విగ్రహప్రతిష్ణాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే..