వచ్చే నెల (ఆగస్టు)లో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించబోవడం ఇదే తొలిసారి.
ప్రధాని మోదీ ఇటీవలే రష్యా పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 23న ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో సంభాషిస్తూ, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కూడా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇటీవలే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment