స్నూకర్స్ టోర్నమెంట్ ప్రారంభం
తెనాలి (మారీసుపేట): నేటి సమాజంలో క్రీడల ప్రాధాన్యం తగ్గిందని, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెనాలి 1వ అదనపు న్యాయమూర్తి జి.ప్రభాకర్ సూచించారు. కోగంటి శివప్రసాదరావు మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్‌ను కొత్తపేటలోని కనికిచర్ల కల్యాణ మండపంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఈ క్రీడను తెనాలిలో నిర్వహించడం ముదావాహం అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు రావడం ఆనందకరమన్నారు. నిర్వాహకులు కోగంటి రోహిత్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్, శాఖమూరి సురేంద్ర, చలసాని బాబు, కోగంటి నవీన్, ఎ.భార్గవ్, వి.మురళీ పాల్గొన్నారు.