రెండో రోజూ స్నూకర్ టోర్నమెంట్
మారీసుపేట(తెనాలి): కోగంటి శివప్రసాద్‌రావు మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం కొనసాగింది. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణ మండపంలో జరుగుతున్న టోర్నమెంట్‌లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 56 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెండో రౌండ్‌లో ప్రతాప్‌పై రమాకాంత్ 0–3, నానిపై గంగాధర్ 0–3 మార్కుల తేడాతో ఉన్నారని నిర్వాహకులు కొగంటి రోహిత్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్‌కు నలుగురు క్రీడాకారులు చేరుకున్నారని చెప్పారు. శనివారం ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. కోగంటి రోహిత్, ఎస్ నరేంద్ర, భార్గవ్, శ్రీధర్ తదితరులు పర్యవేక్షించారు.