వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శనివారం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జి ల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యా యి. పోటీలను నిట్ ఇన్‌చార్జీ డైరెక్టర్ ఆర్‌వీ చలం ప్రారంభించి మాట్లాడారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. మా నసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దోహదపడుతుందన్నారు.
-
హాజరైన 350 మంది విద్యార్థులు
కాజీపేట రూరల్ : వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శనివారం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జి ల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యా యి. పోటీలను నిట్ ఇన్‌చార్జీ డైరెక్టర్ ఆర్‌వీ చలం ప్రారంభించి మాట్లాడారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. మా నసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దోహదపడుతుందన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచిం చారు. పోటీలకు 31 పాఠశాలలు, 5 కళాశాలల నుంచి 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. యోగా అసోసియేషన్ ప్యాటర్న్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా, నిట్ రిజిస్టార్ వైఎన్. రెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ రవిందర్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రా ష్ట్ర కార్యదర్శి పవన్‌కుమార్, రాష్ట్ర జూడో సం ఘం కార్యదర్శి కైలాష్‌యాదవ్, తెలంగాణ రా ష్ట్ర యోగా సంఘం కార్యద ర్శి జె.మనోహర్‌కుమార్, జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.కమలాకర్, ముప్పు మల్లేశం, జిల్లా కోశాధికారి రవిందర్ పాల్గొన్నారు.