Sakshi Money Mantra: Domestic Stock Markets Opened With Gains On Wednesday July 19th, 2023 - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Published Wed, Jul 19 2023 9:42 AM | Last Updated on Wed, Jul 19 2023 11:40 AM

Stock Market Sensex Nifty muted start sakshi money mantra - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం (జులై 19) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.25 గంటల సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 67,021 పాయింట్ల వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 19,810 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీసీ, ఇన్ఫోసిస్‌, విప్రో, అపోలో హాస్పిటల్స్‌ టాప్‌ గెయినర్స్‌గా, మారుతీ సుజికీ, ఐచర్‌ మోటర్స్‌, సిప్లా, హీరో మోటర్‌కార్ప్‌, నెస్లే సంస్థలు టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్‌, ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టగా, ఆటో మొబైల్‌ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement