![stock market today opening 26 october 2023 nifty down to 19000 - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/26/today-market.jpg.webp?itok=zQRuiI2-)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు నమోదైన నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ మళ్లీ 500 పాయింట్ల నష్టానికి చేరువైంది. నిఫ్టీ 19,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 469 పాయింట్ల నష్టంతో 63,580 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల క్షీణతతో 18,975 వద్ద ట్రేడవుతున్నాయి.
టెక్ మహీంద్రా, మహీంద్ర అండ్ మహీంద్ర, అదానీ ఎంటర్‌ప్రైజస్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకుని టాప్ లూజర్ల జాబితాలో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment