16న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ప్రారంభం
నంద్యాల:
నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఈనెల 16వ తేదీన ప్రారంభించడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. రైల్వే డీఆర్‌ఎం విజయశర్మ సోమవారం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే పనుల గురించి సమీక్షించారు. 16వ తేదీన ఈ రైల్వే లైన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. రైల్వే సలహా మండలి సభ్యుడు ఊకొట్టు వాసు ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంజామల రైల్వే స్టేషన్‌కు కేంద్ర మాజీ మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య పేరు పెట్టాలని కోరారు. అలాగే పుష్కర యాత్రల కోసం పూరి–గుంటూరు, రాయిఘడ్–కష్ణకెనాల్ జంక్షన్ రైలును నంద్యాల వరకు పొడిగించాలన్నారు. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను పుష్కరాల సందర్భంగా ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించాలని కోరారు.