
తలసాని శ్రీనివాస్‌యాదవ్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాడిన భాషను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ ప్రసంగంలో కేసీఆర్ అన్నీ నిజాలే చెప్పారని, దాంతో కాంగ్రెస్ నేతలు భయాం దోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలే పొగుడుతున్నారని, కానీ రాష్ట్ర నేతలకు ఇవేవీ కనిపించడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తన భాష తీరును మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.