సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు హ్యాకర్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. భారత ప్రభుత్వ రంగ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు భారత రక్షణ శాఖ వెబ్‌సైట్‌తో పాటు హోం శాఖ, న్యాయ శాఖ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. రక్షణ శాఖ వెబ్‌సైట్ హోం పేజీపై చైనీష్ గుర్తు కనిపిస్తోంది. దీనిని ట్విటర్ ట్రాన్సిలేట్ సహాయంతో తర్జుమా చేయగా 'ధ్యానం' అనే అర్థం వచ్చే విధంగా ఉందని జాతీయ వార్తా సంస్థ దిక్వింట్ ప్రచురించింది. ఈ విషయంపై రక్షణ శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. వెబ్‌సైట్ పునరుద్ధరణకు భారత్ బృందం రంగంలోకి దిగిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే ఈ వార్తలపై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ స్పందించింది. వెబ్‌సైట్లు హ్యాక్ అవలేదని, సాంకేతిక కారణాలతో డౌన్ అయ్యిందంటూ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాక్ అవడం కొత్తేంకాదు. 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకూ సుమారు 144 ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యకింగ్‌కు గురయ్యాయి. ఈవిషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వమే ప్రకటించింది. గత ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వెబ్‌సైట్‌ను హ్యక్ చేశారు. కాశ్మీరలను ప్రధాని మోదీ, పోలీసులు వేధిస్తున్నారంటూ ఫ్రీ కాశ్మీర్ అని వచ్చేలా హ్యాక్ చేశారు. అంతే కాకుండా హోంశాఖ వెబ్‌సైట్‌ను సైతం ఇదే విధంగా హ్యాక్ చేశారు.
Action is initiated after the hacking of MoD website ( https://t.co/7aEc779N2b ). The website shall be restored shortly. Needless to say, every possible step required to prevent any such eventuality in the future will be taken. @DefenceMinIndia @PIB_India @PIBHindi
— Nirmala Sitharaman (@nsitharaman) April 6, 2018
Comments
Please login to add a commentAdd a comment