website hacked
-
ఈసీ వెబ్సైట్ హ్యాక్
సహరాన్పూర్/న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి అందులో 10 వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీలను తయారు చేసిన విపుల్ సైని(24)ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) డిగ్రీ కలిగిన విపుల్ మూడు నెలల్లో 10 వేల ఫేక్ ఐడీలను క్రియేట్ చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఈ పనులు చేయించినట్లు తెలిసిందన్నారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100–200 చొప్పున విపుల్ తీసుకున్నట్లు తేలింది. అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ. 60 లక్షలను సీజ్ చేశారు. -
యూపీఎస్సీ వెబ్సైట్ హ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సీ) హ్యాకింగు గురైంది. దీంతో యూజర్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ప్రముఖ జపనీస్ కార్టూన్ పాత్ర డోరేమాన్ కార్టూన్ పిక్ అప్ ది కాల్... ఐ యామ్ స్టీవ్డ్ అనే డైలాగ్ దర్శనమిచ్చింది. డోరేమాన్ కార్టూన్ సీరియల్ హిందీ పాట వినిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొంతమంది వినియోగదారులు ట్విట్టర్లో వెబ్ సైట్ స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయానికి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.అయితే యూపీ ఎస్సీ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ కావడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రెజిల్ హాక్ టీమ్ ద్వారా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ హ్యాక్ అయింది. గత సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ), ఐఐటీ వారణాసి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎమ్యు), ఢిల్లీ యూనివర్శిటీ (డీయూ) వంటి వెబ్సైట్లను పాకిస్తాన్ అనుకూల సంస్థ హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. UPSC website hacked . @IndianCERT @NICMeity @IndianExpress pic.twitter.com/mLx8bR4iVj — kuldeep nagar (@kuldeepnagar5) September 10, 2018 is #upsc site hacked??? When i try to open it display's doraemon picture. @PMOIndia @ZeeNews pic.twitter.com/mblf3NlRyv — Yashpratap kantharia (@Yashpratap96) September 10, 2018 The website of UPSC has been hacked!!😳😳 pic.twitter.com/OFpHy9k56t — Ruchika Chaubey (@chaubeyruchii) September 10, 2018 -
పీఎఫ్ వెబ్సైట్ హ్యాక్.. భారీగా డేటా చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆధార్ అనుసంధానిత సైట్ aadhaar.epfoservices.comను హ్యాకర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. సమారు 2.7 కోట్ల మంది ఇందులో సభ్యులుగా ఉండగా.. వారి డేటా చోరీకి గురైనట్లు సమాచారం. ఈ మేరకు సాంకేతిక సమాచార శాఖకు ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జోయ్ ఓ లేఖ రాశారు. డేటా చోరీకి గురైందని.. ప్రస్తుతం సైట్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు ఆయన తెలిపారు. టెక్నికల్ టీమ్ త్వరగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోపక్క నిఘా వ్యవస్థ గతంలోనే ఈపీఎఫ్‌వోకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలపై సైబర్ భద్రతా నిపుణులు ఆనంద్ వెంకట్ నారాయణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం అయి ఉండటంతో జీతభత్యం, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలను కూడా హ్యాకర్లు సులువుగా గుర్తించే వీలుండొచ్చని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. గతంలో ఐబీ విభాగం జారీ చేసిన హెచ్చరిక నోట్ -
సుప్రీం కోర్ట్ వెబ్సైట్ హ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : సర్వోన్నత న్యాయస్ధానం వెబ్సైట్ అరగంట పైగా క్రాష్ కావడంతో కలకలం రేగింది. జస్టిస్ బీహెచ్ లోయా కేసుపై ఉత్తర్వులు వెలువరించిన అనంతరం సుప్రీం కోర్ట్ వెబ్సైట్ గురువారం మధ్యాహ్నం అరగంట పాటు హ్యాక్ అయింది. వెబ్సైట్ అందుబాటులో లేకపోవడంతో సాంకేతిక విభాగం హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని గుర్తించి భద్రతా చర్య కింద కొద్దిసేపు సైట్‌ను నిలిపివేసింది. వెబ్సైట్ నిలిచిపోవడాన్ని సుప్రీం కోర్టు నిర్ధారించింది. వెబ్సైట్ పునరుద్ధరణకు మరో రెండుగంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా పదిహేను రోజుల కిందట పలు ప్రభుత్వ వెబ్సైట్ల సేవలు నిలిచిపోవడంతో దీని వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే హార్డ్‌వేర్ వైఫల్యం కారణంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) హోస్ట్ చేస్తున్న 10 వెబ్సైట్లు నిలిచిపోయాయని జాతీయ సైబర్ సెక్యూరిటీ సలహాదారు గుల్షన్ రాయ్ వెల్లడించారు.కాగా సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెలువరించిన కొద్దిసేపటికే సుప్రీం కోర్ట్ వెబ్సైట్ నిలిచిపోయింది. -
భారత్‌కు షాక్: మూడు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు హ్యాకర్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. భారత ప్రభుత్వ రంగ వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు భారత రక్షణ శాఖ వెబ్‌సైట్‌తో పాటు హోం శాఖ, న్యాయ శాఖ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. రక్షణ శాఖ వెబ్సైట్ హోం పేజీపై చైనీష్ గుర్తు కనిపిస్తోంది. దీనిని ట్విటర్ ట్రాన్సిలేట్ సహాయంతో తర్జుమా చేయగా 'ధ్యానం' అనే అర్థం వచ్చే విధంగా ఉందని జాతీయ వార్తా సంస్థ దిక్వింట్ ప్రచురించింది. ఈ విషయంపై రక్షణ శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. వెబ్సైట్ పునరుద్ధరణకు భారత్ బృందం రంగంలోకి దిగిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వార్తలపై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ స్పందించింది. వెబ్సైట్లు హ్యాక్ అవలేదని, సాంకేతిక కారణాలతో డౌన్ అయ్యిందంటూ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ అవడం కొత్తేంకాదు. 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకూ సుమారు 144 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యకింగ్‌కు గురయ్యాయి. ఈవిషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వమే ప్రకటించింది. గత ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వెబ్‌సైట్‌ను హ్యక్ చేశారు. కాశ్మీరలను ప్రధాని మోదీ, పోలీసులు వేధిస్తున్నారంటూ ఫ్రీ కాశ్మీర్ అని వచ్చేలా హ్యాక్ చేశారు. అంతే కాకుండా హోంశాఖ వెబ్‌సైట్‌ను సైతం ఇదే విధంగా హ్యాక్ చేశారు. Action is initiated after the hacking of MoD website ( https://t.co/7aEc779N2b ). The website shall be restored shortly. Needless to say, every possible step required to prevent any such eventuality in the future will be taken. @DefenceMinIndia @PIB_India @PIBHindi — Nirmala Sitharaman (@nsitharaman) April 6, 2018 -
ఏపీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ వెబ్సైట్ హ్యాక్
♦ అడక్కుండానే సెల్ఫోన్లకు ఓటీపీ మెసేజ్‌లు ♦ అభ్యర్థుల ఫిర్యాదుతో సరిచూసుకున్న వర్సిటీ అధికారులు విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్‌కు సంబం«ధించిన వెబ్సైట్ బుధవారం హ్యాకింగ్‌కు గురైంది. అయితే ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ సీట్లకు ఐదో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చేందుకు బుధవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గడువిచ్చారు. దీంతో అభ్యర్థులు బుధవారం ఉదయం నుంచే ఆప్షన్లు ప్రారంభించి మ«ధ్యాహ్నం 2 గంటల్లోగా ముగించారు. నిర్దేశిత కాలం ముగిసినా పలుమార్లు వన్‌టైమ్ పాస్వర్డ్ సందేశాలు రావడంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు అధికారుల దృష్టికి విషయం తెచ్చారు. చివరకు హ్యాకింగ్ జరిగిందనే విషయం నిజమేనని గమనించిన వెబ్సైట్ సాంకేతిక సిబ్బంది, యూనివర్సిటీ అధికారులు.. వెబ్ ఆప్షన్ల గడువును సాయంత్రం 5:30 గంటల వరకు పొడిగించినట్లు అభ్యర్థులందరికీ మెసేజ్‌లు ఇచ్చారు. దీంతో అభ్యర్థులు తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్లు సరిచేసుకున్నారు. దీనికి కారణాలను తెలుసుకుంటున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఈ లోపాన్ని సరిచేశామని ఎటువంటి ఇబ్బంది లేదని వీసీ స్పష్టం చేశారు. -
కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్!
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పకుండా ఇలా చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది. గత నెలలో పాకిస్తాన్ కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్ కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గత నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 700కు పైగా వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ కేసుల్లో 8,348 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు గతవారం ఓ నివేదికలో వెల్లడైంది. -
ఎన్ఎస్జీ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి
న్యూఢిల్లీ: దేశమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉండగా, నేరగాళ్లు భద్రతా సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసుకున్నారు. దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్రవహిస్తోన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్ఎస్జీ సైట్లోకి వెళ్లినవారికి సమాచారం స్థానంలో ఓ అభ్యంతరకర మెసేజ్ దర్శనమిచ్చింది. హ్యాకింగ్‌కు పాల్పడిన గ్రూప్ తనను తాను ‘అలోన్ ఇంజెక్టర్’గా పేర్కొంది. కశ్మీర్లో ప్రభుత్వ, సైనిక హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర రాతలు రాశారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందిచిన అధికారులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేపనిలో పడ్డారు. ఉగ్రదాడుల సమయంలో ప్రజలను కాపాడే బాధ్యతను తలకెత్తుకునే ఎన్ఎస్జీ కమాండోలు.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలకూ అనునిత్యం భద్రత కల్పిస్తూఉంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన సంస్థ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికావడంతో హోంశాఖ వర్గాల్లో కలకలం రేగింది. -
మదురై మీనాక్షి వెబ్సైట్ హ్యాక్
వెబ్సైట్లో పాకిస్తాన్ జెండాలు రంగంలోకి సైబర్ క్రైం పోలీసులు మదురైపై తీవ్రవాదుల గురి సాక్షి, చెన్నై:ఆధ్యాత్మికతకు, పర్యాటకానికి నిలయంగా బాసిల్లుతున్న మదురై నగరంపై తీవ్రవాదులు గురి పెట్టినట్టుగా ఇటీవల వెలుగు చూసింది. దీంతో మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి భక్తుడ్ని తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. 200 మందికిపైగా సిబ్బంది నిత్యం భద్రతా విధుల్లో ప్రవేశ మార్గంలో ఉంటున్నారు. అయినా, నగరంలో సాగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యల పర్వం, తరచూ బెదిరింపులు ప్రజల్ని భయాందోళనలో పడేస్తున్నాయి. ఈ పరిణామాలు నగరం భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఏకంగా అమ్మవారి ఆలయ వెబ్‌సైట్‌ను పాకిస్తానీ ముష్కరులు హ్యాక్ చేయడం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. సేవల వివరాలు : అమ్మవారి ఆలయం మదురై ‘మీనాక్షి’ పేరిట వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందులో ఆలయంలో జరిగే పూజలు, కార్యక్రమాల గురించి పొందు పరిచారు. అలాగే, ఇక్కడ ఎప్పటికప్పుడు సేవలకు సంప్రదించాల్సిన అధికారుల వివరాలు, ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టతను చాటే గ్రంథాలు, రచనలు, తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయానికి మిళితంచేస్తూ మరెన్నో గ్రంథ రచనలు ఈ వెబ్ సైట్లో కొలువు దీరాయి. ఇక చెప్పాలంటే అలనాటి మూలికల వైద్యానికి సంబంధించిన ఎన్నో వివరాలు సైతం ఇందులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి ఈ వెబ్సైట్ హ్యాక్ అయింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్నాడీఎంకే వెబ్‌సైట్‌తో పాటుగా మరికొన్ని వెబ్ సైట్లు హ్యాక్ అరుు్యంది. ఈ కేసుల ఛేదింపులు సైబర్ క్రైంకు శిరోభారంగా మారాయి. తాజాగా, మీనాక్షి అమ్మవారి ఆలయ వెబ్ సైట్ హ్యాక్ కావడంతో సైబర్ క్రైం వర్గాలు పరుగులు తీస్తున్నారుు. సైట్లో పాక్ జెండాలు : మీనాక్షి అమ్మవారి ఆలయ జాయింట్ కమిషనర్ నటరాజన్ ఆలయ వెబ్ సైట్ హ్యాక్ గురి కావడాన్ని గుర్తించారు. ఆలయం వెబ్ సైట్లో పాకిస్తాన్ జెండాలు ఎగురుతుండడం, అఫ్జల్ పేరిట కొన్ని నినాదాలు పొందు పరచి ఉండడంతో మదురై పోలీసు కమిషనర్ సంజయ్ మాథూర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం వర్గాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ నుంచి ఈ సైట్‌ను హ్యాక్ చేసినట్టు గుర్తించారు. ఆ వెబ్ సైట్‌లోని పాకిస్తాన్ జెండాలు, హెచ్చరికల నినాదాల్ని తొలగించే పనిలో పడ్డారు. ఆ సైట్ పూర్తిగా ఓపెన్ కాకుండా అండర్ మెయింటెనెన్స్ అని పేర్కొని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. త్వరలో వెబ్ సైట్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని నటరాజన్ పేర్కొన్నారు.