ఏపీ మెడికల్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌ | AP Medical Web Counseling Website Hacked | Sakshi
Sakshi News home page

ఏపీ మెడికల్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌

Published Fri, Sep 1 2017 1:22 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

AP Medical Web Counseling Website Hacked

అడక్కుండానే సెల్‌ఫోన్లకు ఓటీపీ మెసేజ్‌లు  
అభ్యర్థుల ఫిర్యాదుతో సరిచూసుకున్న వర్సిటీ అధికారులు


విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ): ఏపీ మెడికల్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌కు సంబం«ధించిన వెబ్‌సైట్‌ బుధవారం హ్యాకింగ్‌కు గురైంది. అయితే ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో కాంపిటెంట్‌ అథారిటీ సీట్లకు ఐదో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చేందుకు బుధవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గడువిచ్చారు. దీంతో అభ్యర్థులు బుధవారం ఉదయం నుంచే ఆప్షన్లు ప్రారంభించి మ«ధ్యాహ్నం 2 గంటల్లోగా ముగించారు.

 నిర్దేశిత కాలం ముగిసినా పలుమార్లు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ సందేశాలు రావడంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు అధికారుల దృష్టికి విషయం తెచ్చారు. చివరకు హ్యాకింగ్‌ జరిగిందనే విషయం నిజమేనని గమనించిన వెబ్‌సైట్‌ సాంకేతిక సిబ్బంది, యూనివర్సిటీ అధికారులు.. వెబ్‌ ఆప్షన్ల గడువును సాయంత్రం 5:30 గంటల వరకు పొడిగించినట్లు అభ్యర్థులందరికీ మెసేజ్‌లు ఇచ్చారు. దీంతో అభ్యర్థులు తాము ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు సరిచేసుకున్నారు. దీనికి కారణాలను తెలుసుకుంటున్నామని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ టి.రవిరాజు తెలిపారు. ఈ లోపాన్ని సరిచేశామని ఎటువంటి ఇబ్బంది లేదని వీసీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement