కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్!
కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్!
Published Sun, Feb 12 2017 1:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పకుండా ఇలా చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది.
గత నెలలో పాకిస్తాన్ కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్ కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గత నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 700కు పైగా వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ కేసుల్లో 8,348 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు గతవారం ఓ నివేదికలో వెల్లడైంది.
Advertisement
Advertisement