టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT), కేంద్ర హోమ్ శాఖ సహకారంతో సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మోసపూరిత కమ్యూనికేషన్‌లను పంపినందుకు ఎనిమిది ఎస్ఎమ్ఎస్ హెడర్‌లను బ్లాక్‌లిస్ట్ చేసినట్లు తెలిపింది.
గత మూడు నెలల్లో ఈ ఎనిమిది హెడర్‌ల నుంచి 10,000 కంటే ఎక్కువ మోసపూరిత సందేశాలు వెళ్లాయి. అదే సమయంలో ఈ సందేశాలను పంపించడానికి ఉపయోగించిన 73 ఎస్ఎంఎస్ హెడ్డర్స్, 1522 కంటెంట్ టెంప్లేట్లను డాట్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. కాబట్టి ఈ హెడ్డర్స్ ఇకపై ఎలాంటి మెసేజ్‌లను పంపించలేవు.
మోసపూర్తి ఎస్‌ఎమ్‌ఎస్‌ల నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర హోమ్ శాఖ 'సంచార్ సాతీ' కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైనా మోసపూరిత సందేశాలను అందుకున్నప్పుడు.. లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు వారు సంచార సాథీ పోర్టల్‌లోని చక్షు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా స్పామ్ మీద కంప్లైంట్ చేయడానికి 1909కి కాల్ చేయవచ్చు.. లేదా DND (డు నాట్ డిస్ట్రబ్) అనే సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment