ప్రజలు చట్టబద్ధమైన కాల్‌లను సులభంగా గుర్తించడానికి, టెలిమార్కెటర్‌ల నుంచి వచ్చే అనుచిత వాయిస్ కాల్‌లను అరికట్టడానికి టెలికాం మంత్రిత్వ శాఖ 160xxxxxxx అనే కొత్త నెంబరింగ్ సిరీస్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రమోషనల్, సర్వీస్, ఇతర లావాదేవీల కోసం కేంద్రం టెలిమార్కెటర్‌లకు 140xxxxxx సిరీస్ కేటాయించింది. ఇది ఇకపై 160 నెంబర్ సిరీస్‌కు మారుతుంది. అంటే కస్టమర్ రిసీవ్ చేసుకునే టెలిమార్కెటర్‌ల కాల్ నెంబర్ 160 నెంబర్‌తో మొదలవుతుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 140 సిరీస్‌ను కాల్‌ల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న కారణంగా చాలామంది వాటికి రెస్పాండ్ అవ్వరు. కాబట్టి కొన్ని సార్లు ముఖ్యమైన సర్వీస్/లావాదేవీ కాల్‌లు మిస్ అవుతుంటారు. కాబట్టి ఇకపై అలంటి పొరపాట్లు జరగకుండా డాట్ ఈ 160 నెంబర్ సిరీస్ ప్రవేశపెట్టింది.
140 నెంబర్ సిరీస్ ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. వీటన్నింటిని అరికట్టడానికి కేంద్ర కొత్త సిరీస్ నెంబర్ తీసుకువచ్చింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఎంటిటీల సర్వీస్/లావాదేవీ వాయిస్ కాల్‌ల కోసం ఉపయోగించనున్నారు. కాబట్టి ఈ నెంబర్ సర్వీస్/లావాదేవీ కాల్‌లకు.. ఇతర రకాల కాల్‌లకు మధ్య స్పష్టమైన భేదం చూపడాన్ని సులభతరం చేస్తుంది.
ఆర్‌బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఎ, ఐఆర్‌డీఏ వంటి ఫైనాన్షియల్ ఎంటిటీల నుంచి వచ్చే సర్వీస్/లావాదేవీ కాల్‌లు 1601 నుంచి ప్రారంభమవుతాయి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 160 సిరీస్ నంబర్‌ను కేటాయించే ముందే తప్పకుండా ఖచ్చితమైన ద్రువీకరణను నిర్దారించుకోవాలని డాట్ పేర్కొంది. ఈ నెంబర్ సిరీస్ కేవలం సర్వీస్ / లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment