
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలై
స్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర‍్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.
మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment