భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానమని హర్పర్ కొల్లిన్స్ డిక్షనరీ బోర్డు స్పెషలిస్ట్ అర్నియా సుల్తానా అన్నారు. రాజమహేంద్రవరం ఆల్‌బ్యాంక్ కాలనీలోని షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏషియాటిక్ స్కూలు సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎక్స్‌క్విజిట్ ఇంగ్లిషు ఈడెన్’ పేరుతో ఇంగ్లిషు వారోత్స ప్రారంభ వేడుకలు బుధవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అర్నియా సుల్తానా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంగ్లిషు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలు ఆంగ్లంపై పట్టుసాధించేందుకు ఈనెల 25 వరకు వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, రోల్‌ప్లే, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ కవులు, కవయిత్రుల వేషధారణలో అలరించారు. స్కూలు డైరెక్టర్ తంబాబత్తుల శ్రీవిద్య పాల్గొన్నారు.