ద్విభాషా పరిజ్ఞానం మెదడుకు మంచిదే!
పరిపరి శోధన
మన స్కూళ్లలో చాలావరకు మూడు భాషలు నేర్పిస్తున్నారు. తెలిసిన భాష తప్ప మిగిలిన భాషలను నేర్చుకోవడాన్ని చాలామంది తప్పనిసరి తంటాగా భావిస్తుంటారు. అయితే, ఒకటికి రెండు భాషలు నేర్చుకోవడం మెదడుకు మంచిదేనని అంతర్జాతీయ వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కనీసం రెండు భాషల్లో దాదాపు సరిసమానమైన పరిజ్ఞానం ఉన్నట్లయితే పక్షవాతం వంటివి సోకినప్పుడు త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.
పక్షవాతం సోకిన 600 మంది రోగులపై పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఎడిన్‌బర్గ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రెండు భాషల్లో మంచి పరిజ్ఞానం ఉన్న రోగుల్లో మెదడు పనితీరు త్వరగా మెరుగుపడినట్లు గుర్తించామని వారు అంటున్నారు.