సాంకేతిక సమస్యల వల్ల నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో సోమవారం నుంచి రోజుకు కనీసం 10 గంటలపాటు కరెంటు నిలిపివేస్తుండడంతో వినియోగదారులు
ఖురాన్ అరబీ భాషలో అవతరించింది. ఖురాన్ అనే పదం అరబీ భాషకు చెందింది. దీని అర్థం ఎక్కువ చదివే పుస్తకమని. క్రీస్తు శకం 610లో మహ్మద్ ప్రవక్తపై ‘చదువు నిన్ను సృష్టించిన వాడి సాక్షిగా(అధ్యాయం సూరే అలఖ్‌లో)’ అనే తొలివాక్యంతో అవతరణ ప్రారంభమైంది. క్రీస్తు శకం 632 అనగా 22 ఏళ్ల ఐదున్నర మాసాలలో మొత్తం దివ్య ఖురాన్ పూర్తి అయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఏడేళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గలిగిన స్త్రీ, పురుషులు దీనిని కంఠస్తం చేశారు.
30 భాగాలుగా...
దివ్యఖురాన్ అరబీ భాషలో అవతరించడానికి గల కారణం... ఇది అన్ని భాషలలో కెల్లా సులభతరమైంది కావడమే. దివ్యఖురాన్‌లో 30 భాగాలు, ఏడు దశలు, 114 అధ్యాయాలు, 540 రుకువులు (పేరాగ్రాఫ్‌లు), 6666 వాక్యాలు ఉన్నాయి. అతి పెద్ద అధ్యాయం సూరే బఖరా. అతి చిన్న అధ్యాయం సూరే కౌసర్. మొదటి అధ్యాయం సూరే ఫాతియా. చివరి అధ్యాయం సూరే నాస్. మొదటి దశ సూరే ఫాతిహా నుంచి సూరే నిస్సా. రెండో దశ సూరే మైదా నుంచి సూరే నూర్. మూడో దశ సూరే యూనుస్ నుంచి సూరే నహల్. నాలుగో దశ సూరే బనీ ఇస్రాయిల్ నుంచి సూరే ఫుర్‌ఖాన్. ఐదో దశ షూరా నుంచి సూరే యాసిన్. ఆరో దశ సూరే సఫ్ఫాత్ నుంచి సూరే హుజురాత్. ఏడో దశ సూరే ఖాఫ్ నుంచి సూరే నాస్ వరకు ఉంటుంది.
పర్షియన్ భాషలో..
ఖురాన్‌లోని కేవలం ‘సూరే ఫాతేహా’ అధ్యాయం 7వ శతాబ్దంలో పర్షియన్ భాషలో అనువదించారు. 17వ శతాబ్దంలో ఇతర భాషలలో ఖురాన్ పూర్తిగా అనువదించడం ప్రారంభమైంది. 1772లో తొలిసారి జర్మన్ భాషలో ఖురాన్ అనువదించారు. అప్పటినుంచి 1936 వరకు 102 అరబేతర భాషలలో అందుబాటులోకి తెచ్చారు.
శతాబ్దం క్రితం..
తెలుగు భాషలో ఖురాన్ అనువాదం శతాబ్దం క్రితమే జరిగింది. 1925లో డాక్టర్ చిలుకూరి నారాయణ ఖురాన్‌ను తొలిసారి తెలుగులో తీసుకొచ్చారు. తదనంతరం 1948లో మౌల్వీ అబ్దుల్ గఫూర్ మరింత సరళీకరించారు. 1981లో వ్యవహారిక తెలుగు భాషలో షేక్ మౌలానా హమీదుల్లా షరిష్ దివ్యఖురాన్‌ను అనువదించారు. దీన్ని తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ సంస్థ ప్రచురించింది.
లిపి ఉన్న అన్ని భాషలలో...
ప్రస్తుతం లిపి ఉన్న అన్ని భాషలలో ఖురాన్ అందుబాటులో ఉంది. మనదేశంలోని దాదాపు 14 భాషల్లో ఖురాన్ అనువాదం చేసిన ఘనత జమాతే ఇస్లామీ హింద్ సంస్థకు దక్కుతుంది. 30 ఏళ్ల పాటు కృషి చేసి ఈ అనువాదాన్ని పూర్తిచేశాం.
- ముహ్మద్ అజహరుద్దీన్,
కార్యదర్శి, జమాతే ఇస్లామీ హింద్