తెలుగు భాషా మాంత్రికుడు.. కాళోజీ | Telugu language wizard .. kaloji | Sakshi
Sakshi News home page

తెలుగు భాషా మాంత్రికుడు.. కాళోజీ

Published Sat, Sep 10 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

Telugu language wizard .. kaloji

దేవరకొండ
తెలంగాణ భాషా విశిష్టతను దశదిశలా చాటి చెప్పిన భాషా మాంత్రికుడు కాళోజీ నారాయణరావు అని దేవరగిరి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు పొట్ట ముత్యాలు కొనియాడారు.  పట్టణంలోని సంజయ్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రజాకవి కాళోజీ  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాళోజీ జీవిత విశేషాలను, రచనా శైలిని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు తెలంగాణ పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు నిరసనమెట్ల సుందరయ్య సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొట్ట రాములు, ఉపాధ్యాయులు పొట్ట ప్రేమయ్య, చిన ముత్యాలు, పావని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement