wizard
-
కష్టాలన్నీ తీరుస్తానంటూ నయవంచన చేశాడు
కేజీఎఫ్ : దేవుడి పేరు చెప్పి సమస్యలను పరిష్కరిస్తానని నమ్మించి ఓ మంత్రగాడు మహిళ నుంచి సుమారు 27 కోట్ల విలువ చేసే సైట్లు, ఇతర ఆస్తి పాస్తులను బంగారు ఆభరణాలను తస్కరించుకుని వెళ్లిన ఘటన కోలారు జిల్లా బంగారుపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని శ్రీ నగర కాలనీలోని సొల్లాపురమ్మ దేవాలయ సంస్థాపకుడు, పూజారి నాగరాజ్ అనే వ్యక్తి మహిళను మోసగించాడు. పూజల నెపంతో మహిళను వంచించి నగలు, నగదుతో పరారయ్యాడు. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని తనకు సొల్లాపురమ్మ దేవి పూనుతుందని నమ్మించాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి, బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. కాగా మోసపోయిన మహిళ గతంలో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి బెంగుళూరు బీటీఎం లేఅవుట్లో నివాసం ఉంటోంది. 2019లో భర్త మరణించాడు. అనంతరం మోసపోయిన మహిళ భర్త రెండో భార్య కుమారుడు రాజేష్ తనకు ఆస్తిలో భాగం కావాలని కోర్టుకు వెళ్లాడు. దీంతో విసిగిన మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బెంగుళూరు రామమూర్తి నగర్లో అద్దె ఇంటిలో ఉంటోంది. మహిళ తన కష్టాన్ని బేతమంగలకు చెందిన మునియమ్మతో చెప్పుకుంది. మునియమ్మ తనకు ఓ మాంత్రికుడు పరిచయం ఉన్నాడని అతడు అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని తెలిపింది. బంగారుపేటలోని సొల్లాపురమ్మ దేవాలయ పూజారి నాగరాజ్‌ను పరిచయం చేసింది. నాగరాజ్ ప్రతి శుక్రవారం, మంగళవారం తన దేవాలయానికి వచ్చి పూజలు చేయాలని తనకు ప్రతి శుక్ర, మంగళవారాలలో దేవి ఆవహించి కోరికలు తీరుస్తుంది. దేవి చెప్పినట్లుగా నడచుకోవాలని లేని పక్షంలో కీడు కలుగుతుందని భయపెట్టాడు. పూజారి నాగరాజ్ చెప్పినట్లుగానే మహిళ ప్రతి శుక్ర, మంగళవారాలు దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించేది. ఓ రోజు నాగరాజ్ దేవి ఆవహించిందని నాటకం ఆడి ఆస్తి విషయానికి సంబంధించి ముగ్గురు కుమారులకు గండం ఉందని ఒక్కో కుమారుడి పేరుతో తలా మూడు బంగారు బిస్కెట్లు దానం చేయాలని తెలిపాడు. అతను చెప్పినట్లుగా మహిళ తన వద్ద బంగారాన్ని కరిగించి కిలో తూకం కలిగిన మూడు బంగారం బిస్కెట్లను సమర్పించుకుంది. మరో వారం తన వద్దకు వచ్చిన మహిళతో భూమి, స్థిరాస్తి ఉందని దానిని సూచించిన వారికి విక్రయించి ఆ డబ్బును తనకిస్తే దానిని రెండింతలు చేసి ఇస్తానని నమ్మించాడు. అతను చెప్పినట్లుగా మహిళ బెంగుళూరులోని తన 10కి పైగా సైట్లను విక్రయించి వచ్చిన డబ్బును తీసుకు వచ్చి మంత్రగాడి చేతిలో పెట్టింది. డబ్బు బంగారం చేతికి రాగానే నాగరాజ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ బెంగుళూరు రామమూర్తి నగర్ పోలీస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడానికి బంగారుపేటకు రాగా మాయగాడు అక్కడి నుంచి మాయమయ్యాడు. పూ జారి భార్య లక్ష్మమ్మ, బావమరిది పెరు మాళ్, సహచరుడు దేవరాజ్, హోసూరు మంజు, సాయి కృష్ణ అనే వ్యక్తులపై కూడా మౌఢ్యాచార నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టారు. -
మంత్రగాడి ఇంటి పక్కన ఓ మహిళ..
సాక్షి, చిత్తూరు : మంత్రగాడిని ఆశ్రయించిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపుతోంది. రాపకుప్పం మండలం వీర్నమల పంచాయతీ కుల్లిగానూరుకు చెందిన పవనమ్మ గత ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో కుప్పంకు చెందిన హకీమ్ అక్బర్ అనే మంత్రగాడిని సంప్రదించారు. మూడు రోజుల పాటు ఆ మహిళ ఆ మంత్రగాడి ఇంట్లోనే ఉన్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ మంత్రగాడి ఇంటి పక్కనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోపినగర్ సమీప వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన జరగ్గా.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కారులో బాధితురాలి ఇంటికి తరలించారు. మంత్రగాడి వల్లే పవనమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
లంకె బిందెలు దొరికాయ్.. సెల్‌ఫోన్ రికార్డ్స్ కలకలం
సాక్షి, కడప : బద్వేలులో లంకెబిందెలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా... బద్వేలు పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న జయరామిరెడ్డి రెండు నెలల కిందట అర్ధరాత్రి మంత్రగాడి సహాయంతో ఒక పురాతన బిందెను ఇంట్లోకి తీసుకెళ్లడం సమీపంలో ఉన్న ఒక మహిళ కంటబడింది. ఏమిటని ఆమె నిలదీయడంతో ఆయన బయటకు చెప్పవద్దంటూ బతిమాలుకున్నారు. తదుపరి ఆమె తన భర్త సుధాకర్‌రెడ్డితో విషయాన్ని చెప్పింది. ఆయన జయరామిరెడ్డితో విషయాన్ని అడిగి బయటకు చెప్పకుండా ఉండాలంటే మాకు ఏమి ఇస్తావని బేరం పెట్టారు. బిందెలను ఓపెన్ చేయడానికి సమయం పడుతుందని చెప్పాడు. ఎవరికి చెప్పకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కథ కొద్ది రోజులు నడిచింది. రెండు నెలలుగా అద్దెకు ఉంటున్న ఇంటికి జయరామిరెడ్డి రాకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. వీటి రికార్డ్స్ ప్రస్తుతం బయటకు రావడంతో పాటు పట్టణంలో వైరల్‌గా మారాయి. దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. పోరుమామిళ్ల మండలంలోని పురాతన ఆలయమైన చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో ఈ గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలో పూర్వకాలంలో రాజులు నివాసం ఉండేవారని, వారి కాలంలోని లంకెబిందె దొరికిందని సమాచారం. దీనిపై పూజారి గరుడాద్రి స్వామి మాట్లాడుతూ తాను శనివారం మాత్రమే ఆలయం వద్ద పూజలు చేసి వెళతానని, సమీపంలో తవ్వకాలు జరిపి, మళ్లీ మట్టితో కప్పెట్టినట్లు ఆనవాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బద్వేలు పట్టణంలో గుప్తనిధుల తవ్వకాల విషయమై కలకలం రేగుతోంది. -
నవ వధువుపై గ్యాంగ్‌రేప్
కురుక్షేత్ర: ఓ నవవధువుకు మత్తుమందు ఇచ్చిన అత్తారింటివారు.. ఆమెపై ఓ తాంత్రికుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ‘మీ కుమార్తె మానసికస్థితి సరిగ్గా లేదు’ అంటూ అమ్మాయి తండ్రికి సమాచారం అందించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హరియాణాలోని యమునానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. యమునానగర్ పట్టణంలో ఉంటున్న ఓ యువకుడికి కురుక్షేత్రకు చెందిన యువతితో ఈ నెల 12న వివాహమైంది. ఆమె అత్తారింటిలో అడుగుపెట్టగానే ఓ తాంత్రికుడిని కుటుంబ సభ్యులు రప్పించారు. అనంతరం యువతిచేత ఓ ద్రవాన్ని తాగించారు. ఆమె స్పృహ కోల్పోగానే భర్త అన్నయ్యతో పాటు ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించిన తాంత్రికుడు.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె దుస్తులను తగలబెట్టారు. తనపై జరిగిన దారుణాన్ని కుమార్తె తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ కుట్రలో పెళ్లికుమారుడి తల్లి, చెల్లెలు కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తొలుత జీరో ఎఫ్ఐఆర్(బదిలీ చేయగలిగే ఎఫ్ఐఆర్)ను నమోదుచేసిన కురుక్షేత్ర పోలీసులు.. యమునానగర్ పోలీస్‌స్టేషన్‌కు దాన్ని బదిలీచేశారు. -
అమీబాకు తాంత్రికుడి పేరు
వాషింగ్టన్ : ఏకకణ సూక్ష్మజీవి అమీబా జాతిలో మరో నూతన అమీబా సూక్ష్మజీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అనంతరం దీనికి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నవలా సిరిస్‌లోని ప్రముఖ తాంత్రికుడు గ్లాండఫ్ పేరును నామకరణం చేశారు. ప్రస్తుతం కనుగొన్న ఈ సూక్ష్మజీవి నవలా సిరిస్‌లోని తాంత్రికుడు ధరించే టోపీని పోలి ఉండడంతో దీనికి ఈ పేరును పెట్టినట్లు వివరించారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న 30 నుంచి 45 అమీబా జాతులలో ఇప్పుడు గుర్తించిన తెకోఅమోబియాన్స్ జాతి ఒకటని వారు వెల్లడించారు. ఈ సూక్ష్మజీవులు వాటిని కాపాడుకొనేందుకుగాను తమ అభివృద్ధి క్రమంలో వాటి బాహ్య రూపాన్ని పలు రకాల ఆకృతులలో నిర్మించుకునే లక్షణాన్ని కలిగి ఉన్నట్లు వారు తెలిపారు. బ్రెజిల్‌లోని మరింగా యూనివర్సిటీ, సావో పాలో వర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అమీబాను గుర్తించారు. -
మంత్రగాడు తన కూతుర్ని లోబరచుకున్నాడు
-
తెలుగు భాషా మాంత్రికుడు.. కాళోజీ
దేవరకొండ తెలంగాణ భాషా విశిష్టతను దశదిశలా చాటి చెప్పిన భాషా మాంత్రికుడు కాళోజీ నారాయణరావు అని దేవరగిరి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు పొట్ట ముత్యాలు కొనియాడారు. పట్టణంలోని సంజయ్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాళోజీ జీవిత విశేషాలను, రచనా శైలిని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు తెలంగాణ పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు నిరసనమెట్ల సుందరయ్య సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొట్ట రాములు, ఉపాధ్యాయులు పొట్ట ప్రేమయ్య, చిన ముత్యాలు, పావని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.