
అమీబాకు తాంత్రికుడి పేరు
వాషింగ్టన్ : ఏకకణ సూక్ష్మజీవి అమీబా జాతిలో మరో నూతన అమీబా సూక్ష్మజీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అనంతరం దీనికి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నవలా సిరిస్‌లోని ప్రముఖ తాంత్రికుడు గ్లాండఫ్ పేరును నామకరణం చేశారు. ప్రస్తుతం కనుగొన్న ఈ సూక్ష్మజీవి నవలా సిరిస్‌లోని తాంత్రికుడు ధరించే టోపీని పోలి ఉండడంతో దీనికి ఈ పేరును పెట్టినట్లు వివరించారు.
ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న 30 నుంచి 45 అమీబా జాతులలో ఇప్పుడు గుర్తించిన తెకోఅమోబియాన్స్ జాతి ఒకటని వారు వెల్లడించారు. ఈ సూక్ష్మజీవులు వాటిని కాపాడుకొనేందుకుగాను తమ అభివృద్ధి క్రమంలో వాటి బాహ్య రూపాన్ని పలు రకాల ఆకృతులలో నిర్మించుకునే లక్షణాన్ని కలిగి ఉన్నట్లు వారు తెలిపారు. బ్రెజిల్‌లోని మరింగా యూనివర్సిటీ, సావో పాలో వర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అమీబాను గుర్తించారు.