
సాక్షి, చిత్తూరు : మంత్రగాడిని ఆశ్రయించిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపుతోంది. రాపకుప్పం మండలం వీర్నమల పంచాయతీ కుల్లిగానూరుకు చెందిన పవనమ్మ గత ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో కుప్పంకు చెందిన హకీమ్ అక్బర్ అనే మంత్రగాడిని సంప్రదించారు. మూడు రోజుల పాటు ఆ మహిళ ఆ మంత్రగాడి ఇంట్లోనే ఉన్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ మంత్రగాడి ఇంటి పక్కనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోపినగర్ సమీప వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన జరగ్గా.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కారులో బాధితురాలి ఇంటికి తరలించారు. మంత్రగాడి వల్లే పవనమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment