సాధారణంగా ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉంటుంది. అదే వాళ్ల మాతృ భాష కూడా అవుతుంది. ఆ ఊళ్లో మాత్రం రెండు భాషలు మాట్లాడుతారట. అది కూడా మహిళలకు ఓ భాష. పురుషులు మరో భాష. అదేం వింత, ఎక్కడా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. సౌత్ నైజీరియాలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలు భాష విషయంలో పాటిస్తున్న ఆచారం ఇది. ఎందుకంటే వారు ఇలా వేర్వేరు భాషలు మాట్లాడటం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తారట.
ఆ ఉరిలో.. వ్యవసాయం చేసుకునే ఉబాంగ్ అనే తెగ వాళ్లే ఎక్కువగా ఉంటారు. అయితే.. వాళ్లు రెండు భాషలు మాట్లాడటం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఉదాహరణకు, ఒక స్త్రీ యమ్‌ను 'ఇరుయ్' అని పిలవగా, పురుషులు మరోలా పిలుస్తారట. మహిళలు దుస్తులను 'అరిగా' అని పురుషులు దీనిని 'ఎన్‌కి' అని పిలుస్తారు. ఇలా పురుషులకు, మహిళలకు వేర్వేరు భాషలు ఉన్నా వారి మధ్య భాషపరంగా ఏ సమస్యలు తలెత్త లేదని అక్కడి ప్రజలు చెప్తుతున్నారు.
ఇలా వాళ్లకి భాషలు విభజించినప్పటికీ కొన్ని పదాలు మాత్రం కామన్‌గా ఉంటాయట. చిన్నపిల్లలు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏ భాష మాట్లాడినా పట్టించుకోరు కానీ.. మగ పిల్లలు మాత్రం 10 ఏళ్లు దాటితే ఖచ్చితంగా పురుషుల భాషనే మాట్లాడాలి. ఈ విషయంలో ఎవరూ ఒత్తిడి చేయకపోయినా మహిళల భాషను పురుషులు మాట్లాడితే మాత్రం వింతగా చూస్తారట. అందుకే అక్కడి నియమాలు తెలిసిన వాళ్లు ఎవ్వరూ తమ భాష కాకుండా వేరే మాట్లాడరు.
చదవండి: Siddharth: హీరో సిద్ధార్థ్ మృతి అంటూ సంతాపం, స్పందించిన హీరో
Comments
Please login to add a commentAdd a comment