తాష్కెంట్ లో భారతీయులతో మోదీ భేటీ
ఉజ్బెకిస్థాన్ : విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో భారతీయులతో భేటీ అయ్యారు. అక్కడి ఎన్నారైలతో సమావేశం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భారతీయ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతానికి ఎనలేని ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. మనిషి వికాసంలో భాష కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భాష అన్ని ప్రాంతాలు, సంప్రదాయాలను కలుపుతుందన్నారు. 50 ఏళ్లుగా ఇక్కడి రేడియోల ద్వారా హిందీలో ప్రసారాలు జరగడం గొప్ప విషయమని, ఇది తనకు సంతోషాన్ని కలిగించిదని తెలిపారు. మనిషి హింసా మార్గం వైపు వెళ్లకుండా సంగీతం తోడ్పడుతుందన్నారు. ఆందోళనల నుంచి విముక్తికి, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం మంచి మార్గమని ప్రధాని సూచించారు.