పశువులు కూడా సిగ్గు పడే భాష | animals will also shy seeing that revanth language | Sakshi
Sakshi News home page

పశువులు కూడా సిగ్గు పడే భాష

Published Fri, Jul 3 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

పశువులు కూడా సిగ్గు పడే భాషను కొంతమంది ఉపయోగిస్తున్నారని, తాను అలా మాట్లాడలేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు

సాక్షి, హైదరాబాద్: పశువులు కూడా సిగ్గు పడే భాషను కొంతమంది ఉపయోగిస్తున్నారని, తాను అలా మాట్లాడలేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల నీతి నిజాయితీ, విలువల గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు ఏ విలువలను ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.

రేవంత్‌రెడ్డి వాడిన భాషను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తప్పు చేయలేదని, డబ్బు తీసుకెళ్లలేదని, స్టీఫెన్‌సన్‌కు ఇవ్వలేదని, ఆ డబ్బుతో పార్టీకి సంబంధం లేదని, ఆడియో టేపులో ఉన్న సంభాషణ తనది కాదని చంద్రబాబు ఇంతవరకు చెప్పలేదన్నారు. సభ్యతలేని మనుషులు మాట్లాడే అసభ్యమాట లను మీడియా కూడా తొలగించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement