తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా రావూరి రవికుమార్ ఎన్నికయ్యారు.
కర్నూలు సిటీ: తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా రావూరి రవికుమార్ ఎన్నికయ్యారు. ఇటీవల వేదిక జాతీయ అధ్యక్షుడు పి.హరికృష్ణ తనను ఎంపిక చేసినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తెలుగు భాషా పరిరక్షణ, మాతృ భాషాభివృద్ధికి తెలుగు దేశం పార్టీ అనుబంధంగా ఈవేదిక ఏర్పడినట్లు వెల్లడించారు. మాతృ భాషాపై ప్రజలో చైతన్యం తీసుకువచ్చేందుకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భాషాభివృద్ధికి కృషిచేసే కళాకారులు, కవులకు అవార్డులు అందజేస్తామని చెప్పారు.