తెలుగు భాషను పరిరక్షించుకుందాం
Published Mon, Aug 15 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
అనంతపురం సిటీ: తెలుగు భాషకు ప్రాణం పోయాలి..అచ్చ తెలుగును కాపాడు కోవాలని తెలుగు భాషా సంఘం జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ‘కృష్ణా పుష్కర కవితోత్సవం’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పొట్లూరి హరికృష్ణతోపాటు రాష్ట్ర పౌరసంబంధాలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువశ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ చమన్‌తో పాటు ప్రముఖ కవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణాపుష్కరాల ప్రాధాన్యతను వివరిస్తూ కొందరు, జిల్లా కరువు స్థితిగతులకు అద్దం పట్టేలా మరికొందరు కవులు తమ కవిత్వాన్ని చదివి వినిపించారు. నేటి తరానికి అచ్చతెలుగు భాషను అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంగ్లంపై మోజుతో తల్లిలాంటి తెలుగు భాషను పక్కన పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కవితలతో మెప్పించిన వారిని తెలుగు భాషా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో కవులు జాబిలి జయచంద్ర, ఏలూరి యంగన్న, రియాజ్, రఘురామయ్య, వెంకటేశులు, జూటూరు షరీఫ్‌లతో పాటు పలువురు ఉన్నారు.
Advertisement
Advertisement