న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఆటో విడిభాగాల సప్లయర్ బాష్ తన భారత్ యూనిట్‌లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోవడంతో ఇండియన్ యూనిట్‌లో 2000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది. రానున్న నాలుగేళ్లలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ర భట్టాచార్య వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిలో బ్లూ, వైట్ కాలర్ సిబ్బంది ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్ పరిశ్రమ అంతటా చోటుచేసుకుంటున్న మార్పుల్లో ఇది ఓ భాగమని అన్నారు. మార్పులకు అనుగుణంగా కంపెనీని మలచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా, ఆటోమొబైల్ విక్రయాలు ఊపందుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని బాష్ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment