మయామి: డ్రాగన్ అనే మానవరహిత సరకు రవాణా అంతరిక్ష నౌకలో ఒక సూపర్ కంప్యూటర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు పంపేందుకు స్పేస్‌ఎక్స్ సిద్ధమైంది. హెచ్‌పీ కంపెనీ తయారుచేసిన ఈ సూపర్ కంప్యూటర్...భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై వ్యోమగాములకు దిశానిర్దేశం చేయగలదు.
అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కేనవెరల్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.31 గంటలకు ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. రాకెట్‌ను ప్రయోగించిన దాదాపు 10 నిమిషాల్లోనే అది మళ్లీ కేప్ కేనవెరల్‌కు వచ్చి ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తుంది. రాకెట్‌ను ప్రయోగించిన ప్రతిసారి, దానిని మళ్లీ అదే ప్రదేశానికి రప్పించి అందులోని పరికరాలను పునర్వినియోగించాలని స్పేస్–ఎక్స్ గతంలో నిర్ణయించింది.